Hyderabad: 118 మద్యం షాపులు.. దరఖాస్తులు 54
ABN , Publish Date - Oct 08 , 2025 | 09:49 AM
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మద్యం షాపుల లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్‌కే ఫయాజ్ ఉద్దీన్, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ, బాలానగర్ ఎక్సైజ్ ఇన్‌చార్జ్ సీఐ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
- బాలానగర్‌లో 10, కుత్బుల్లాపూర్‌లో 16, మేడ్చల్‌లో 28
- దరఖాస్తులకు చివరి తేదీ ఈనెల 18
హైదరాబాద్: మేడ్చల్- మల్కాజిగిరి(Medchal- Malkajgiri) జిల్లా పరిధిలోని మద్యం షాపుల లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎస్‌కే ఫయాజ్ ఉద్దీన్, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ, బాలానగర్ ఎక్సైజ్ ఇన్‌చార్జ్ సీఐ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 రిటైల్ మద్యం దుకాణాల కేటా యింపును ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. మేడ్చల్ జిల్లా ప్రొహి బిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సూచ నలు మేరకు జిల్లా యూనిట్‌లో మొత్తం 118 మద్యం షాపులు ఉండగా, ఇప్పటి వరకూ 54 దరఖాస్తులు వచ్చాయన్నారు.

వీటిలో బాలానగర్(Balanagar) పరిధిలో 10, కుత్బుల్లాపూర్ పరిధిలో 16, మేడ్చల్ పరిధిలో 28 దరఖాస్తులు అందాయన్నారు. గత నెల 26 నుంచి పీర్జాదీగూడ లోని శ్రీపల్లవి కన్వెన్షన్ సెంటర్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, ఈనెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్ 8712658727 లో సంప్రదించాలని జిల్లా ప్రొహిబిషన్ అధికారి ఫయాజ్‌ఉద్దీన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి పరుగు మరింత ముందుకు.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
బిగ్ బాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
Read Latest Telangana News and Nationa