Share News

Medak: మెదక్‌ జిల్లాలో దారుణం..

ABN , Publish Date - Aug 08 , 2025 | 09:36 PM

మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న బిడ్డపై ఆ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Medak: మెదక్‌ జిల్లాలో దారుణం..
10 Years old Girl

మెదక్, ఆగస్ట్ 08: కన్న తండ్రి అయి ఉండి సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు. 10 ఏళ్ల కన్న కుమార్తెపై ఆ తండ్రి ఆగమయ్య (35) పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆ బాలిక బయటకు చెప్పుకో లేకపోయింది. అయితే ఆ బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో ఏం జరిగిందంటూ ఆ బాలికను కన్నతల్లి ఆరా తీసింది. కన్న తండ్రి తనపై జరిపిన అఘాయిత్యాన్ని కన్నతల్లికి ఆ బాలిక కన్నీటితో చెప్పింది. దాంతో ఆ కన్నతల్లి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం మండలంలో చోటు చేసుకుంది.


ఈ నేపథ్యంలో భర్త ఆగమయ్యపై అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు వివిధ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆగమయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వైపు వైద్య పరీక్షల నిమిత్తం బాలికను మెదక్ జిల్లా ప్రభుత్వా ఆసుపత్రికి తరలించారు. తన భర్తను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరింది. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. ఈ దారుణానికి ఒడిగట్టిన వారికి కఠినంగా శిక్షించాలని ఆ కన్నతల్లి పోలీసులను ప్రాధేయపడింది.

ఈ వార్తలు కూడా చదవండి..

‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’

అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 08 , 2025 | 09:36 PM