Maoist encounter: పూజారి కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో మృతులు 18 కాదు 12 మంది
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:41 AM
తెలంగాణ సరిహద్దులోని ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్‌లోని పూజారి కాంకేర్, మల్లంపేట అడవుల్లో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.
వారిలో 8 మంది నక్సలైట్లు, నలుగురు గ్రామస్థులు
క్షేమంగానే దామోదర్: మావోయిస్టు పార్టీ లేఖ
చర్ల, ములుగు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సరిహద్దులోని ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్‌లోని పూజారి కాంకేర్, మల్లంపేట అడవుల్లో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. ఆ ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు, అందులో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కారదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్లు మావోయిస్టు పార్టీ సౌత్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ పేరుతో గతంలో విడుదలైన లేఖ నకిలీదని తెలిపింది. ఆ లేఖను పోలీసులే సృష్టించారని ఆరోపించింది. దామోదర్ సురక్షితంగా ఉన్నట్టు పేర్కొంది.
పూజారి కాంకేర్ అడవుల్లో పోలీసులు జరిపిన దాడిలో 12మంది చనిపోయారని, వారిలో 8 మంది మావోయిస్టులు, నలుగురు గ్రామస్థులు ఉన్నారని మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ప్రతినిఽధి సోమ తేర్ అలియాస్ సమత పేరుతో శనివారం లేఖ విడుదలైంది. పోలీసులు వందలమంది గ్రామస్థులను పట్టుకుని తీసుకుని వెళ్లారని, వారి ఆచూకీ ఇప్పటికీ తెలియదని ఆ లేఖలో మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఈ లేఖ విడుదలతో దామోదర్ ఎలా ఉన్నాడనే ఉత్కంఠకు తెర పడినట్లయింది.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి