Maoist Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ మావోయిస్టు మృతి
ABN , Publish Date - May 04 , 2025 | 03:34 AM
ఛత్తీస్‌గఢ్ గరియాబంద్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఐదుగురు మరో ప్రాంతంలో లొంగిపోయారు. ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు కూబింగ్ చర్యలు కొనసాగిస్తున్నారు

చర్ల, మే 3 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా శోభా అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ఒకరు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. అతని వద్ద నుంచి ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీ, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అతడిని ఐతు అలియాస్ యోగేశ్‌గా గుర్తించామని, అతడు మావోయిస్టు పార్టీలో గరియాబంద్ డీవీసీఎం సభ్యుడిగా పనిచేస్తున్నాడని పేర్కొ న్నారు..
ఈ ఎన్‌కౌంటర్‌లో చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నారని, వారికోసం కూంబింగ్ కొనసాగిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే దంతెవాడ జిల్లాలో శనివారం ఐదుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వారంతా కొంత కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అలాగే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దులోని కర్రె గుట్టల్లో కూబింగ్ కొనసాగుతూనే ఉంది