Rangareddy Court: పెళ్లాడతానని నమ్మించి అత్యాచారం..
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:37 AM
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ...
మహిళను మోసగించిన వ్యక్తికి 20 ఏళ్ల కారాగారం
2017నాటి కేసులో రంగారెడ్డి కోర్టు తీర్పు
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాక, బాధితురాలికి పరిహారంగా రూ.2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో 2017లో నమోదైన ఓ కేసులో మంగళవారం ఈ మేరకు తుది తీర్పు వెల్లడించింది. ఇందుకు సంబంధించి సైబరాబాద్ డీసీపీ క్రైమ్ ఎ.ముత్యం రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన స్వాగత్ కమార్ భోయ్ హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో నివాసముంటూ సాఫ్ట్‌వేర్‌గా పని చేసే వాడు. 2009 నుంచి 2017 వరకు హైదరాబాద్, నొయిడా, చెన్నైల్లో బాధితురాలితో కలిసి ఉన్న స్వాగత్ కుమార్ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే, 2017 నవంబరు 28న స్వాగత్ కుమార్.. ఒడిసాలోని తన స్వస్థలంలో మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న బాధితురాలు అక్కడికి వెళ్లి నిలదీసింది. తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి స్వాగత్ కుమార్ బాధితురాలిని బెదిరించి అక్కడి నుంచి పంపేశాడు. దీంతో బాధితురాలు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన అప్పటి గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ దర్యాప్తు చేపట్టారు. ఆ సమయంలో డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్‌గా పని చేసిన ఎన్.వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడు స్వాగత్ కుమార్ భోయ్‌ను అరెస్టు చేసి కోర్టులో హజరుపరిచి చార్టీషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు సెషన్స్ జడ్జి.. నేరం రుజువు కావడంతో స్వాగత్ కుమార్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,100 జరిమానా, బాధితురాలకి రూ.2లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మణిపూర్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఏపీ మహేష్ బ్యాంక్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
For More National News And Telugu News