Share News

Mahesh Kumar Gowd: డీఎస్‌.. జీవితాంతం లౌకిక వాది

ABN , Publish Date - Jun 30 , 2025 | 06:54 AM

జీవితాంతం కాంగ్రెస్‌ వాది, సెక్యులరిస్టుగా ఉన్న పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) విగ్రహాన్ని.. బీజేపీ నేత.. ఆర్‌ఎ్‌సఎస్‌ వాదితో ఆవిష్కరింప చేసినందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Mahesh Kumar Gowd: డీఎస్‌.. జీవితాంతం లౌకిక వాది

  • ఆర్‌ఎ్‌సఎస్‌ వాదితో విగ్రహావిష్కరణ చేసినందుకు..

  • ఆయన ఆత్మ క్షోభిస్తుంది!: మహేశ్‌కుమార్‌గౌడ్‌

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):జీవితాంతం కాంగ్రెస్‌ వాది, సెక్యులరిస్టుగా ఉన్న పీసీసీ మాజీ చీఫ్‌ డి.శ్రీనివాస్‌ (డీఎస్‌) విగ్రహాన్ని.. బీజేపీ నేత.. ఆర్‌ఎ్‌సఎస్‌ వాదితో ఆవిష్కరింప చేసినందుకు ఆయన ఆత్మ క్షోభిస్తుందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతాలను ఆయన ఒప్పుకొనేవాడు కాదన్నారు. నిజామాబాద్‌లో డీఎస్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం ఇచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని, కానీ.. ఆ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్‌ నేతలెవరికీ ఆహ్వానం అందలేదని అన్నారు.


డీఎస్‌ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆదివారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మహేశ్‌కుమార్‌గౌడ్‌, మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీనియర్‌ నేత వి.హన్మంతరావు తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తనకు రాజకీయంగా ఓనమాలు నేర్పిందే డీఎస్‌ అని స్మరించుకున్నారు. కొడుకుల కారణంగా తండ్రి ఆత్మ క్షోభించే పరిస్థితి వచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jun 30 , 2025 | 06:54 AM