Share News

Mahesh Kumar Goud: దేవుడి పేరిట బీజేపీ ఓట్ల వేట

ABN , Publish Date - Feb 26 , 2025 | 04:18 AM

ప్రతీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ దేవుడి పేరును వాడుకొని లబ్ధి పొందుతోందని, మతవిద్వేషాలతో ఎన్నికల్లో లబ్ధి కోరుకోవడం దేశాభివృద్ధికి విఘాతమని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ విమర్శించారు.

Mahesh Kumar Goud: దేవుడి పేరిట బీజేపీ ఓట్ల వేట

  • మతవిద్వేషాలు రెచ్చగొట్టడం ఆ పార్టీకి అలవాటు

  • టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌

కరీంనగర్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రతీ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ దేవుడి పేరును వాడుకొని లబ్ధి పొందుతోందని, మతవిద్వేషాలతో ఎన్నికల్లో లబ్ధి కోరుకోవడం దేశాభివృద్ధికి విఘాతమని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌ విమర్శించారు. కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు మతవిద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఫార్ములా ఈ రేసు అవినీతిలో కేటీఆర్‌పై కేసు నమోదై, విచారణ జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు కూడా ఇవ్వలేదని బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదన్నారు.


విదేశాల్లో తలదాచుకున్న ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నిందితులను రప్పించడానికి కేంద్రమే చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పరిమితి తెలియదా అని ప్రశ్నించారు. కాగా రాష్ట్ర ప్రజలకు మహే్‌షకుమార్‌ గౌడ్‌ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు.. బండి సంజయ్‌ కేంద్ర మంత్రిగా ఉండి మతత్వాన్ని రెచ్చగొట్టడం సరికాదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీని పాకిస్థాన్‌తో పోల్చడానికి కొంచమైనా సిగ్గుండాలని ఒక ప్రకటనలో మండిపడ్డారు.

Updated Date - Feb 26 , 2025 | 04:18 AM