Mahesh Kumar Goud: రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది
ABN , Publish Date - Aug 17 , 2025 | 04:52 AM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ కమిటీకి సిఫారసు చేసినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గం
మార్వాడీలను వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదు
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
హైదరాబాద్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ కమిటీకి సిఫారసు చేసినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపైౖ పరిశీలించమని క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవికి చెప్పామన్నారు. మంత్రి పదవి, ఇతర విషయాలపై ఎందుకు, ఎవరిని ఉద్దేశించి ఆ వాఖ్యలు చేశారో తెలుసుకుంటామని చెప్పారు. ఇక మార్వాడీలు గో బ్యాక్ అంటూ ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. మార్వాడీలు మనలో ఒకరని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని, దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. మరోవైపు త్వరలో సీఎం రేవంత్‌రెడ్డితో అసంఘటిత కార్మికుల సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన అఖిల భారత అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు కేకేసీ నేషనల్ ఛైర్మన్ ఉదిత్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
పోలవరం కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయినా కనిపించడం లేదా?: కేటీఆర్
‘‘పోలవరంలో కాఫర్ డ్యామ్ (ప్రాజెక్టు నిర్మాణం కోసం మట్టితో ఏర్పాటు చేసిన తాత్కాలిక కట్టడం) రెండోసారి కొట్టుకుపోయినా జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ)కు కానరావడం లేదా...? కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే కూలేశ్వరం అని కారుకూతలు కూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు పోలవరంను కూలవరం అనే దమ్ము, ధైర్యం ఉందా...?’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా...? అంటూ శనివారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్‌డీఎ్‌సఏను దించి.. బీఆర్‌ఎ్‌సపై బురదజల్లిన బీజేపీ నేతలు.. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయిన పోలవరం కాఫర్ డ్యామ్‌పై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. 2020లో పోలవరం డయాప్రమ్ వాల్ రెండేళ్లకు కొట్టుకుపోయినా ఇప్పటికీ ఉలుకు పలుకు లేదని, రెండుసార్లు కాఫర్ డ్యామ్ గోదావరి పాలైనా.. తెలంగాణలో ఎస్‌ఎల్‌బీసీ టన్నుల్ కుప్పకూలి 8 మంది చనిపోయినా ఎన్‌డీఎ్‌సఏలో స్పందన లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తృటిలో తప్పిన ప్రమాదం.. విమాన ప్రయాణికులు సురక్షితం
రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
మరిన్ని తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు చదవండి..