Mahalaxmi Scheme: 2 ఏళ్లలో 118.78 కోట్ల మంది..
ABN , Publish Date - Dec 10 , 2025 | 08:36 AM
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతోంది. అయితే.. మహిళలకిచ్చిన హామీ మేరకు మహాలక్ష్మిల ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు అవుతోంది. కాగా.. ఈ 24 నెలల కాలంలో 118.78 కోట్ల మంది ఉచిత ప్రయాణం చేసినట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి.
- మహాలక్ష్మిల ఉచిత ప్రయాణం
- 24 నెలల్లో ఉచిత టికెట్లతో ఆర్టీసీకి రూ2,757 కోట్లు
- 2023 డిసెంబరు 9న మహాలక్ష్మి పథకం ప్రారంభం
- నిత్యం 18లక్షల మంది మహిళల ప్రయాణం
హైదరాబాద్ సిటీ: మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme)తో సిటీ బస్సుల్లో 24 నెలల్లో 118.78 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు సాగించారు. 2023 డిసెంబరు 9న ఈ పథకం ప్రారంభించగా, ఈ ఏడాది 8 వరకు గ్రేటర్‌జోన్‌లో 118.78 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సేవలు వినియోగించుకున్నారు. టికెట్ చార్జీల రుసుం రూ.2,757 కోట్ల వరకు ఉండగా వాటిని ప్రభుత్వం దశల వారీగా ఆర్టీసీకి చెల్లిస్తోంది.

బస్సుల్లో రోజూ 16 లక్షల 18 వేల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు సాగిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో ఆక్యుపెన్సీ రేషియో 70 శాతం నుంచి 105 శాతానికి పెరిగింది. త్వరలో మహిళల ఉచిత ప్రయాణాలకు కొత్తగా 150 మెట్రో ఎక్స్‌ప్రెస్ లను ఆర్టీసీ అందుబాటులోకి తెస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News