Hyderabad: మద్యం షాపుల దరఖాస్తుకు 18 వరకు గడువు..
ABN , Publish Date - Oct 09 , 2025 | 12:19 PM
చార్మినార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2025-27 సంవత్సరానికి గాను మద్యం షాపుల నిర్వహణకు లైసెన్స్ పొందడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చార్మినార్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
- చార్మినార్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు
హైదరాబాద్: చార్మినార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2025-27 సంవత్సరానికి గాను మద్యం షాపుల నిర్వహణకు లైసెన్స్ పొందడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు చార్మినార్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ జి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. రిటైల్ మద్యం షాపుల నిర్వహణకు 2025 డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 2027 నవంబర్ 30 వ తేదీ వరకు నడిపించుకోవడానికి కొత్త లైసెన్సులను పొందడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలిపారు.

21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన వారు ఎవరైనా రూ. మూడు లక్షలు (నాన్ రిఫండబుల్) చెల్లించి ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. షాపు కేటాయింపు పొందిన వారికి లైసెన్సు రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతుందన్నారు. మద్యం దుకాణాల కోసం తమ దరఖాస్తులను సంబంధిత డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్, కమీషనర్ ఆఫ్ ప్రొహిబిషన్,
ఎక్సైజ్, తెలంగాణ రాష్ట్రం కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్(Hyderabad) జిల్లాకు సంబంధించిన మద్యం దుకాణాల దరఖాస్తులు నాంపల్లిలోని అబ్కారీ భవన్‌లో నాలుగో అంతస్తులో స్వీకరించబడతాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడికి పగ్గాల్లేవ్.. బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
భారత్ దాల్.. అంతా గోల్‌మాల్!
Read Latest Telangana News and National News