Sangareddy: 113 మంది విద్యార్థులకు ఒక్కటే బాత్రూమ్!
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:33 AM
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంగారెడ్డిలోని సంజీవనగర్ సర్కారు బడి దుస్థితి
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద నిర్మించిన ఒక్క మూత్రశాలనే విద్యార్థినులతో పాటు ఉపాధ్యాయురాళ్లు వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాఠశాలలో 113 మంది విద్యార్థులుండగా అందులో బాలురు 70 మంది, బాలికలు 43 మంది ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.
బాలురు పాఠశాల ఆవరణలోని మైదానంలో బహిరంగ మూత్ర విసర్జన చేయవలసి వస్తోంది. జిల్లా కలెక్టర్ స్పందించి ఈ పాఠశాలలో మరుగుదొడ్లు, అదనపు మూత్రశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం
Read latest Telangana News And Telugu News