Share News

KTR: ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్

ABN , Publish Date - Oct 27 , 2025 | 03:02 PM

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు సోమవారం ఆటోలో కేటీఆర్ ప్రయాణించి మాట్లాడారు. ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. వారికి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు.

KTR: ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ మోసం చేసింది: కేటీఆర్
KTR

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 27: కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు సమస్యలతో సతమతమవుతూ మరింత దిగజారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వరకు సోమవారం ఆటోలో ఆయన ప్రయాణించారు. తెలంగాణ భవన్ కి చేరుకొని ఆ తర్వాత అక్కడ జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ప్రసంగించారు. ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. వారికి తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ ఈరోజు భారత రాష్ట్ర సమితి నేతలంతా హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల కష్టాలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.


ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. డ్రైవర్ మష్రత్ అలీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని తానే స్వయంగా తీసుకువెళ్లానని డ్రైవర్ అలీ తెలిపారు. ఆ తర్వాత తనకు ఉన్న రెండు ఆటోలు అమ్ముకొని ఇప్పుడు డ్రైవర్‌గా కూలీ పని చేస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ అలీ పరిస్థితిపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలయ్యేలా రేవంత్ రెడ్డి సర్కార్‌పై ఒత్తిడి తీసుకువస్తామని హమీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

Addanki Dayakar on BRS: బావా, బామ్మర్దుల నస భరించలేకున్నాం: అద్దంకి దయాకర్

MP Bandi Sanjay: గాంధీ వారసుల్లో నిజాయితీ ఉంటే.. హామీలు అమలు చేయాలి..

Updated Date - Oct 27 , 2025 | 04:13 PM