KTR: రాష్ట్ర ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్: కేటీఆర్
ABN , Publish Date - Oct 19 , 2025 | 12:28 PM
ఓరుగల్లు అంటే ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు గుర్తుకు వచ్చేదని KTR తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ మిల్లు కేవలం పదివేల మందికి ఉపాధిని కల్పించిన మిల్లు మాత్రమే కాదని.. వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించిన మిల్ అని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి ఆజం జాహీ మిల్లు మూతపడిందని చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్, అక్టోబర్ 19: తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 2023 వరకు రాష్ట్ర ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ నిలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ కొనియాడారు. ఓరుగల్లు అంటే ఒకప్పుడు ఆజం జాహీ మిల్లు గుర్తుకు వచ్చేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ మిల్లు కేవలం పదివేల మందికి ఉపాధిని కల్పించిన మిల్లు మాత్రమే కాదని.. వరంగల్, హన్మకొండ పట్టణాలకు విద్యుత్ వెలుగులను ప్రసాదించిన మిల్ అని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి ఆజం జాహీ మిల్లు మూతపడిందని చెప్పారు.
తెలంగాణ వచ్చిన తరువాత ఓరుగల్లుకు పూర్వవైభవం తేవాలని మన బిడ్డలకు కొలువులు దొరకాలనే కేసీఆర్ తపనతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు అంకురార్పణ చేశారని పేర్కొన్నారు. ఆనాడు పడ్డ బీజం ఇప్పుడు క్రమక్రమంగా ఎదిగి వస్తున్నదని, వేలమంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నదని తెలిపారు. ప్రస్తుతం గణేశా, గణేశా ఎకోస్ఫియర్, యంగ్‌వన్, కిటెక్స్ సంస్థలు తమతమ యూనిట్లను మొదలుపెట్టాయని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
BC Bandh Attack In Hyderabad: బంద్ వేళ దాడులు.. ఎనిమిది మంది అరెస్ట్
MP Etala Rajender On Tirumala: టీటీడీ ట్రస్టులో బంజారాలకు అవకాశం కల్పించాలి: ఎంపీ ఈటల రాజేందర్