Ramachandra Naik: సిస్టర్ స్ట్రోక్‌తో మతి భ్రమించిన కేటీఆర్
ABN , Publish Date - May 27 , 2025 | 03:55 AM
సిస్టర్ స్ట్రోక్‌తో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మతి భ్రమించిందని, అందుకే సొంత చెల్లెలు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఆరోపించారు.
ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): సిస్టర్ స్ట్రోక్‌తో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మతి భ్రమించిందని, అందుకే సొంత చెల్లెలు కవిత అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేయడానికి ముందు కేటీఆర్.. తన ఇంట్లో సమస్య పరిష్కరించుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తన బావ, మాజీ మంత్రి టి.హరీష్ రావు కాళ్లు పట్టుకున్నట్లే, ఇప్పుడు చెల్లి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళ్లు పట్టుకోవాలని కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ హితవు చెప్పారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం తదితర కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే లేఖ డ్రామా ఆడుతున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రవీంద్ర నాయక్ ఆరోపించారు. బీఆర్‌ఎ్‌సలో అంతర్గత సమస్యలపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా లేఖ రాశారో.. లేక ఆమెతో స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆరే రాయించారోనన్న అనుమానం కలుగుతున్నదని చెప్పారు.