KTR: సంజయ్‌కు 48 గంటల గడువు!
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:42 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్‌పై వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలి..
క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తా: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా పని చేయడమంటే ఢిల్లీ బాసులకు చెప్పులు మోసినంత ఈజీ కాదని అన్నారు. మీడియా హెడ్‌లైన్లు, చీప్ పబ్లిసిటీ కోసం సంజయ్ వీధి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. తన ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా నిరూపించాలని, లేకుంటే 48 గంటల్లోపు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆయనకు లీగల్ నోటీసు పంపిస్తున్నానని, 48 గంటలలో స్పందించకుంటే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు. కేంద్రం ఆమోదించక ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సంబరాలు ఎందుకు చేసుకుందో రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల పేరుతో చేస్తున్న కాలయాపనను పక్కనబెట్టి కామారెడ్డి డిక్లరేషన్‌లోని ఇతర హామీలను రాష్ట్ర ప్రభుత్వంతో అమలు చేయించాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News