Share News

KTR Criticizes Rahul Gandhi: కేంద్రంలో బడా మోదీ.. రాష్ట్రంలో చోటా మోదీ

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:19 AM

కేంద్రంలో బడా మోదీ.. రాష్ట్రంలో చోటా మోదీ... కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, వీరి మధ్య రాహుల్‌గాంధీ ఆటలో అరటిపండు...

KTR Criticizes Rahul Gandhi: కేంద్రంలో బడా మోదీ..  రాష్ట్రంలో చోటా మోదీ

  • రాహుల్‌.. ఆటలో అరటిపండు: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో బడా మోదీ.. రాష్ట్రంలో చోటా మోదీ... కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, వీరి మధ్య రాహుల్‌గాంధీ ఆటలో అరటిపండు కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి మధ్య అనేక పోలికలున్నాయని, హామీల అమలులో ఇద్దరూ విఫలమయ్యారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్‌లో సోమవారం బీజేపీ నాయకురాలు అలూరి విజయభారతిసహా పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రేవంత్‌ వ్యవహారశైలి చూస్తుంటే రేపోమాపో మోదీతో కలిసిపోయేలా ఉన్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎంకు బీజేపీ ఎంపీలు కొమ్ముకాస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు ద్రోహం చేయడంలో బీజేపీ, కాంగ్రె్‌సలు రెండూ ఒకటేనని, పరిశ్రమలు, పెట్టుబడులు, విభజన హామీల అమలులో తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు. గోదావరి నీళ్లను దిగువకు పంపి ఏపీలోని బనకచర్ల, అక్కడినుంచి తమిళనాడుకు నీటిని తరలించేందుకు మోదీ, చంద్రబాబు ఆదేశాలతో రేవంత్‌రెడ్డి కుట్రచేస్తున్నారని ఆరోపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కేసీఆర్‌ పునాది వేసిన భవనాలనే.. నేడు రేవంత్‌రెడ్డి ప్రారంభించి వచ్చారని ఎద్దేవా చేశారు.


ఇవి కూడా చదవండి..

ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ

ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం

For More National News

Updated Date - Aug 26 , 2025 | 03:19 AM