KTR Challenge: పార్టీ మారినోళ్లు దమ్ముంటే రాజీనామా చేయాలి
ABN , Publish Date - Aug 25 , 2025 | 03:52 AM
పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటి చేసి గెలవాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక ..
20 నెలల్లో చేసింది చెప్పి ఎన్నికల్లో గెలవాలి
బై ఎలక్షన్లు వస్తే.. కాంగ్రె్‌సకు బై బై: కేటీఆర్
హైదరాబాద్ సిటీ/మియాపూర్/హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటి చేసి గెలవాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ విసిరారు. 20 నెలల పాలనలో రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బై ఎలక్షన్లు వస్తే.. కాంగ్రె్‌సకు బై బై ఎలక్షన్ అయితదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని పేర్కొన్నారు. మియాపూర్‌లో నిర్వహించిన శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేకు రెండు సార్లు బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చి గెలిపించామని, ప్రభుత్వ విప్ లాంటి పదవులు ఇచ్చి గౌరవించుకున్నామని, అయినప్పటకీ పార్టీ మారి కాంగ్రె్‌సలోకి వెళ్లారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఉపఎన్నికలు తప్పక వస్తాయని, కాంగ్రెస్‌కు రోజులు ముగియ బోతున్నాయన్నారు. కాగా, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేందు కు గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా నాలుగు టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రుల నిర్మాణాలను చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్మాణాలను వేగంగా పూర్తిచేసి వైద్య సేవలు ప్రారంభించాలని ఆదివారం ఎక్స్ వేదికగా కోరారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్‌పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News