KTR: ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రెస్ నేతల దోపిడీ
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:23 AM
హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రె్‌సపార్టీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రైతన్నల ఇండ్ల స్థలాలూ వదల్లేదు: కేటీఆర్
హైదరాబాద్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో కాంగ్రె్‌సపార్టీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ నేతలు గద్దల్లా వాలి దోచుకుంటున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలోతొక్కిన ముఖ్యమంత్రి.. తమపార్టీ నేతలతో కలిసి ఫార్మాసిటీ భూములను కొట్టేస్తున్నారని బుధవారం ఎక్స్ వేదికగా ఆయన పేర్కొన్నారు.
ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతన్నలకు నష్టపరిహారంగా కేటాయించిన ఇండ్ల స్థలాలను కాంగ్రె్‌సనేతలు తమ పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవగానే ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దుచేసి, భూములను రైతన్నలకు తిరిగి ఇస్తామన్న హామీ ఏమైంది? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతులకు నష్టపరిహారంగా దక్కాల్సినదాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు దోచుకుంటున్నారని నిలదీశారు.