Global Summit: గ్లోబల్ సమ్మిట్‌కు కృష్ణా జలాలు..
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:20 AM
నగరంలో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాగ్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు కృష్ణా జలాలు సరఫరా చేస్తున్నారు. వాటర్‌బోర్డు ఆధ్వర్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తాగునీటి సరఫరాతోపాటు మురుగునీటి నిర్వహణను వాటర్‌బోర్డు చేపడుతోంది. అలాగే పదివేల లీటర్ల సామర్థ్యంగల ఏడు సంపులను నిర్మించారు.
- ప్రత్యేక పైపులైన్
- ప్రాంగణంలో ఏడు సంపులు
- సివరేజీ నిర్వహణకు సెఫ్టిక్ ట్యాంకులు
హైదరాబాద్ సిటీ: భారత్ ప్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్(Global Summit) ప్రాంగణానికి కృష్ణా జలాలు సరఫరా అవుతున్నాయి. వాటర్‌బోర్డు ఆధ్వర్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తాగునీటి సరఫరాతోపాటు మురుగునీటి నిర్వహణను వాటర్‌బోర్డు చేపడుతోంది. తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి పర్యవేక్షణలో పలువురు ఇంజనీర్లను గ్లోబల్ సమ్మిట్ నోడల్ ఆఫీసర్లుగా నియమించారు.

పదిరోజుల నుంచి పగలు, రాత్రి పనిచేసి తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణకు చర్యలు చేపట్టారు. ప్యూచర్ సిటీ(Future City) ప్రాంతానికి మిషన్ భగీరథ ద్వారా కృష్ణా జలాలు సరఫరా అవుతుండగా, గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణానికి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేశారు. పదివేల లీటర్ల సామర్థ్యంగల ఏడు సంపులను నిర్మించారు. సంపుల్లోకి కృష్ణా జలాలను తీసుకురావడం, అక్కడి నుంచి సమ్మిట్ ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నీటి ట్యాంకులకు పంపింగ్ చేస్తున్నారు.

ఆరు నీటి ట్యాంకర్లను కూడా అందుబాటులో ఉంచారు. మురుగునీటి నిర్వహణ కోసం ఐదు టాయిలెట్స్ బ్లాక్‌లను ఏర్పాటు చేయగా, హాల్స్‌లోనూ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన మురుగు చేరడానికి 8 సెఫ్టిక్ ట్యాంక్‌లను ఏర్పాటు చేశారు. సెఫ్టిక్ ట్యాంక్‌లు నిండితే ఖాళీ చేసేందుకు నాలుగు ఎయిర్‌టెక్ మిషన్లను అందుబాటులో ఉంచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News