Share News

KPHB Auction: ఎకరం 65.34 కోట్లు

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:38 AM

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నిర్వహించిన వేలంలో ఎకరం ధర రూ.65.34కోట్లు పలికింది. ఈ భూమిని

KPHB Auction: ఎకరం 65.34 కోట్లు

  • కేపీహెచ్‌బీలో వేలం పాటలో పలికిన ధర

  • రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల ద్వారా రూ.26 కోట్లు

  • హౌసింగ్‌ బోర్డుకు భారీ ఆదాయం

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నిర్వహించిన వేలంలో ఎకరం ధర రూ.65.34కోట్లు పలికింది. ఈ భూమిని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెన్సీ ఆఫ్‌ ఇండియా అనే సంస్థ ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌లో అత్యధిక ధరకు దక్కించుకుందని బోర్డు ఎండీ వీపీ గౌతమ్‌ తెలిపారు. ఈ ప్లాట్‌ కూకట్‌పల్లిలోని ఫేజ్‌-4లో ఉంది. మరోవైపు రాజీవ్‌ స్వగృహ పరిధిలోని బండ్లగూడలో ఉన్న వివిధ టవర్లలోని 159 ఫ్లాట్లకు బుధవారం లాటరీ నిర్వహించారు. ఈ లాటరీ ద్వారా హౌసింగ్‌ బోర్డుకు మరో రూ.26కోట్ల ఆదాయం వచ్చింది. 3 బీహెచ్‌కే (11) ఫ్లాట్లకు దాదాపు 1325 దరఖాస్తులు, 2 బీహెచ్‌కే (19) ఫ్లాట్లకు 525, సింగిల్‌ బెడ్‌ రూమ్‌ (105) ఫ్లాట్లకు 234 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 159 ఫ్లాట్లలో సీనియర్‌ సిటిజన్లకు కేటాయించినవి పోగా, మిగిలిన వాటికి ఈ దరఖాస్తులను స్వీకరించారు. లాటరీ ప్రక్రియ సీనియర్‌ సిటిజన్ల కోసం కేటాయించిన ఫ్లాట్లతో ప్రారంభమైంది. బండ్లగూడలో ఫ్లాట్లు దక్కని దరఖాస్తుదారులు పోచారంలో ఉన్న ఫ్లాట్లకు అదే రశీదులతో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు ప్రకటించింది. సింగిల్‌ బెడ్‌ రూమ్‌ (రూ.13లక్షలు) ఫ్లాట్‌లు 255, 2బీహెచ్‌కే (రూ.19 లక్షలు) ఫ్లాట్లు 340 అందుబాటులో ఉన్నాయి. ఈ ఫ్లాట్లకు గురువారం సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆగస్టు 1, 2 తేదీల్లో లాటరీ నిర్వహిస్తామని హౌసింగ్‌ బోర్డు ప్రకటించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 04:38 AM