Konda Murali: గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు పెట్టా
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:16 AM
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒకవైపు.. మిగతా పార్టీ ఎమ్మెల్యేలు మరోవైపు.
నాకు 500 ఎకరాల భూమి ఉంది
ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాను
నాకు ఉన్నత వర్గాలతోనే పోటీ: కొండా మురళి
వరంగల్ సిటీ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ దంపతులు ఒకవైపు.. మిగతా పార్టీ ఎమ్మెల్యేలు మరోవైపు.. పరస్పర వ్యాఖ్యలతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. గత ఎన్నికల్లో తాము రూ. 70 కోట్లు ఖర్చు పెట్టామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చెప్పారు. ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనని, తనకు 500 ఎకరాల భూమి ఉందని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మానని తెలిపారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే పోటీపడ్డానని చెప్పారు. మొత్తానికి వరంగల్ కాంగ్రెస్ రాజకీయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.