Komatireddy Venkata Reddy: రోడ్డు ప్రమాదాల్లో.. ప్రజలు మరణిస్తే బాధ్యత ఎవరిది?
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:11 AM
రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తే.. బాధ్యత ఎవరిది?’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు చాలా సమయం తీసుకుంటే ఎలా? అని అధికారులను నిలదీశారు.
తక్షణమే రహదారుల మరమ్మతులు
అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
‘‘రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తే.. బాధ్యత ఎవరిది?’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు చాలా సమయం తీసుకుంటే ఎలా? అని అధికారులను నిలదీశారు. అధికారులతో రోడ్ల మరమ్మతులపై ఆయన సమీక్ష నిర్వహించారు. హైబ్రిడ్ యాన్యునిటీ మోడ్(హ్యామ్)లో అభివృద్ధి చేయాల్సిన రోడ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలని, వాటిని రెండు/మూడు నెలల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రోడ్డు నాణ్యతలో రాజీ పడకూడదని, నిర్మాణ కాంట్రాక్టులను దక్కించుకున్నవాళ్లే 15 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతను చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..