Share News

Komatireddy Reddy: మరో అయిదేళ్లు మేమే: కోమటిరెడ్డి

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:39 AM

మరో అయిదేళ్లు తామే అధికారంలో కొనసాగుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

Komatireddy Reddy: మరో అయిదేళ్లు మేమే: కోమటిరెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మరో అయిదేళ్లు తామే అధికారంలో కొనసాగుతామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం సూచించారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణలో లేదని, బీజేపీ స్టేట్‌మెంట్‌లకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. వచ్చే అయిదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందన్నారు.


ప్రతిపక్షాలకు ఏమీ పని పాట లేదని అందుకే ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం సీట్లు కాంగ్రెస్‌ పార్టీ గెలిచే విధంగా పని చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించినట్లు తెలిపారు. తీన్మార్‌ మల్లన్న విషయంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Updated Date - Feb 07 , 2025 | 03:39 AM