Komatireddy Venkat Reddy: కేటీఆర్, హరీశ్ నా కాలి గోటికి సరిపోరు
ABN , Publish Date - Jan 30 , 2025 | 03:52 AM
కేటీఆర్, హరీశ్‌రావు తన కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌లా తాను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదని, కేటీఆర్‌కు ఉన్నట్లు తనపై అవినీతి మరకలు లేవన్నారు. నీతి, నిజాయితీకి మారుపేరు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ సభల్లో పల్లీలు అమ్ముకునేంతమంది కూడా కేటీఆర్ సభకు రాలేదు
గద్దర్‌కు పద్మ అవార్డు ఇస్తే తప్పేంటి?
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): కేటీఆర్, హరీశ్‌రావు తన కాలిగోటికి కూడా సరిపోరని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌లా తాను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదని, కేటీఆర్‌కు ఉన్నట్లు తనపై అవినీతి మరకలు లేవన్నారు. నీతి, నిజాయితీకి మారుపేరు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన మంత్రితో ముఖాముఖీ కా ర్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, ప్రజలను కలసి వారి సమస్యలు విన్నారు. అనంతరం మీడియాతో ఆయన మా ట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గత 13 నెలల నుంచి అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలకైనా వస్తారో లేదో చెప్పాలన్నారు.
కేసీఆర్ కంటే జైలుకెళ్లిన లాలూప్రసాద్ యాదవ్ నయమన్నారు. జైలుకు వెళ్లకున్నా కేసీఆర్ ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. ‘కేటీఆర్ పనికిరానోడు.. పనికిరాని మాటలు మాట్లాడుతున్నడు. కేటీఆర్ దగ్గర ఏముంది?... రూ.లక్షల కోట్లు, ఈ కార్ రేసు అవినీతి తప్ప! నాకు లక్షల కోట్లు లేకున్నా.. ప్రజల అండదండలున్నాయ’ని అన్నారు. కాంగ్రె స్ సభల్లో పల్లీలు, ఐస్‌క్రీమ్‌లు అమ్ముకోడానికి ఎంతమంది వస్తారో అంతమంది కూడా కేటీఆర్ ధర్నాకు రాలేదన్నారు. నల్లగొండలో టీ హబ్‌కు తాళం వేసిందే కేటీఆర్ అని ఆరోపించారు. గద్దర్‌కు పద్మ అవార్డు ఇస్తే తప్పేంటని ప్రశ్నించా రు. ఆయనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. కాగా, మంత్రితో ము ఖాముఖీలో వెంకట్‌రెడ్డిని అక్షర చిట్‌ఫండ్ బాధితులు కలిసి తమకు జరిగిన మోసాన్ని వివరించారు. దీంతో మంత్రి డీజీపీకి ఫోన్ చేసి ఆ సంస్థ ఎండీ పేరాల శ్రీనివా్‌సరావుపై కఠిన చర్య లు తీసుకుని న్యాయం చేయాలని సూచించారు.