Share News

Kishan Reddy: రాష్ట్రంలో రాహుల్‌ ట్యాక్స్‌

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:54 AM

తెలంగాణను పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ దోచుకుందని ప్రజలు కాంగ్రె్‌సకు అవకాశం ఇస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ ట్యాక్స్‌ను విధిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు.

Kishan Reddy: రాష్ట్రంలో రాహుల్‌ ట్యాక్స్‌

  • హైదరాబాద్‌ స్థిరాస్తి వ్యాపారుల్లో భయం

  • 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?: కిషన్‌రెడ్డి

ఖానాపూర్‌/భైంసా/నిజామాబాద్‌/హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ దోచుకుందని ప్రజలు కాంగ్రె్‌సకు అవకాశం ఇస్తే.. ఆ పార్టీ రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ ట్యాక్స్‌ను విధిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భయపడే పరిస్థితి ఉందన్నారు. శనివారం నిర్మల్‌ జిల్లాలోని భైంసా, ఖానాపూర్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో.. అదేవిధంగా నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన హామీ ఏమైందని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి కోరారు.


ఎన్నికల వాయిదాకు కాంగ్రెస్‌ కుట్ర: లక్ష్మణ్‌

స్థానిక ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక.. ఏదో ఒక వంకతో వాయిదా వేసేందుకు సీఎం రేవంత్‌ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎంపీ లక్ష్మణ్‌ మండిపడ్డారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనపై నమ్మకం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ.. సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్‌ చేశారు. శనివారం హనుమకొండ జిల్లా కార్యాలయంలో అరుణ మీడియాతో మాట్లాడారు.

సీఈవోకు బీజేపీ ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణ న్యూస్‌టుడే సంస్థ తమపై దుష్ప్రచారం చే స్తున్నాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో)కి బీజేపీ శనివారం ఫిర్యాదు చేసింది.

Updated Date - Feb 23 , 2025 | 04:54 AM