GST Fraud: జీఎస్‌టీలో ఇదో నయా మోసం
ABN , Publish Date - Jul 31 , 2025 | 04:35 AM
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఖాళీ వాహనాలను నడిపి.. పత్రాల్లో మాత్రం భారీగా సరుకుల రవాణా జరిగినట్లు
33.20 కోట్ల ఐటీసీని కొల్లగొట్టిన ‘కేషాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ’
మహారాష్ట్రకు ఖాళీ వాహనాలు.. సరుకు రవాణా జరిగినట్లు బురిడీ
సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, జూలై 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణ-మహారాష్ట్ర మధ్య ఖాళీ వాహనాలను నడిపి.. పత్రాల్లో మాత్రం భారీగా సరుకుల రవాణా జరిగినట్లు కేషాన్ ఇండస్ట్రీస్ ఎల్‌ఎల్‌పీ అనే ప్రైవేటు కంపెనీ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను బురిడీ కొట్టించింది. ఏకంగా రూ.33.20 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను కాజేసింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) నుంచి టోల్‌ప్లాజాల డేటాను పరిశీలించగా అసలు బండారం బయటపడింది. కేషాన్ ఇండస్ట్రీ్‌సకు సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట్‌లో గోదాం, మెదక్ జిల్లాలోని కలకల్ ఆటోమేటివ్ పార్క్, ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ కంపెనీ తెలంగాణ నుంచి మహారాష్ట్రకు రాగి వస్తువులను తరలించకపోయినా తరలించినట్లు దొంగ ఇన్వాయి్‌సలను సృష్టించింది. జీఎ్‌సటీ కౌన్సిల్ వెబ్‌సైట్ నుంచి ఈ-వేబిల్లులు జనరేట్ చేసింది. వీటి ఆధారంగా భారీగా రాగి సంబంధిత వస్తువులు, సరకులు మహారాష్ట్రకు తరలించినట్లు వాణిజ్య పన్నుల శాఖను నమ్మించింది. దాదాపు రూ.100 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయి్‌సలను సృష్టించింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎన్‌హెచ్‌ఏఐ నుంచి వాహనాల రాకపోకల డేటాను తీసుకుని పరిశీలించారు. వాహనాల రాకపోకలు రికార్డులు ఉన్నప్పటికీ. కంపెనీ జనరేట్ చేసిన ఈ-వేబిల్లుల్లోని సరకు భౌతికంగా లేనట్లు కనుగొన్నారు. ఇది
జీఎ్‌సటీలో కొత్త రకం మోసమని వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కె.హరిత ఓ ప్రకటనలో తెలిపారు. తనిఖీల సందర్భంగా ఖాతా పుస్తకాలు, రిజిస్టర్లు, హార్డ్ డిస్కులు, సీసీటీవీ ఫుటేజ్‌లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. సంస్థ డైరెక్టర్లు వికా్‌షకుమార్ కేషాన్, రజనీష్ కేషాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ నగరంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) డీసీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.
మరో రకం మోసం
మెహిదీపట్నంలో మరో రకమైన మోసాన్ని అధికారులు గుర్తించారు. ఏపీ 29 టీఏ 7213 నెంబరు కల వాహనం ఈ ఏడాది జూన్ నుంచి ఎటూ కదలకుండా ఒకే దగ్గర ఉంది. కానీ ఈ వాహన రిజిస్ట్రేషన్ నెంబరును ఉపయోగించి, కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఈ-వేబిల్లులను జనరేట్ చేశారు. వాహనంలో సరకులు రవాణా అయినట్లు నమ్మించారు. ఇది కేంద్ర వస్తు సేవల పన్ను(సీజీఎ్‌సటీ) చట్టం-2017 నిబంధనలకు విరుద్ధమని హరిత తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన న్యాయమైన పన్ను ఆదాయాన్ని ఎగవేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News