Mahesh Goud: కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్‌కు
ABN , Publish Date - Sep 02 , 2025 | 04:03 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ.. కేసీఆర్ కుమార్తె కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని స్పష్టమైందని టీపీసీసీ..
టీపీసీసీ చీఫ్ మహే్‌షగౌడ్
దోచుకున్న డబ్బులో వాటా ఇవ్వలేదనే కవిత ఆవేదన: చామల
హైదరాబాద్, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ.. కేసీఆర్ కుమార్తె కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని స్పష్టమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షగౌడ్ పేర్కొన్నారు. తప్పు చేసింది కేసీఆరా, హరీశ్‌రావా అన్నది తమకు అనవసరమని, స్కాం జరిగిందన్నది స్పష్టమైందన్నారు. ఇందులో కేసీఆర్ వాటా, హరీశ్‌రావు వాటా ఎంతన్నది తేలాల్సి ఉందన్నారు. కేసీఆర్ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్‌కు చేరిందన్నారు. సీఎం రేవంత్‌పై కవిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాళేశ్వరం నిర్మాణంలో తప్పు చేయలేదంటున్న బీఆర్‌ఎస్ నేతలు.. సీబీఐ విచారణ అనగానే ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. మొదటి దఫా ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా హరీశ్ రావు తప్పు చేస్తే కేసీఆర్ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, అప్పుడే కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. మొదట కేటీఆర్, అనంతరం కవిత అమెరికా పర్యటనకు వెళ్లి అవగాహన కుదుర్చుకొని.. అంతర్గత కలహాలతో హరీశ్ రావును టార్గెట్ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ కుటుంబానికి కామధేనువైందన్నది కవిత వ్యాఖ్యలతో నిజమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కేసీఆర్ కుటుంబసభ్యులే చెబుతున్నారన్నారు. ఈ అవినీతి వ్యవహారంలో హరీశ్‌రావు, సంతో్‌షరావులకు సంబంధం ఉందని కవిత తేల్చి చెప్పారన్నారు. పదేళ్లపాటు దోచుకున్న డబ్బులో వాటా ఇవ్వలేదనే ఆవేదన కవితలో స్పష్టంగా కనబడుతోంద ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలు జరిగినట్లు ఆమె చెప్పకనే చెప్పిందన్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను బలపరుస్తూ.. నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చలను కూడా ఆమె ఆమోదించినట్లుగా మాట్లాడిందని.. దాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News