KCR: బీసీ రిజర్వేషన్‌పై కాంగ్రె్‌సకు చిత్తశుద్ధి లేదు
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:51 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ సర్కార్‌కు లేదని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు.
ఆ పార్టీ మోసాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి.. బీసీ నాయకులకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచన
19న విస్తృత స్థాయి సమావేశంపై కేటీఆర్, హరీశ్‌తో చర్చ
సిల్వర్ జూబ్లీ వేడుకలు, భారీ సభ నిర్వహణపై దిశానిర్దేశం
హైదరాబాద్/గజ్వేల్/మర్కుక్, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ సర్కార్‌కు లేదని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వ్యవసాయక్షేత్రంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, పలువురు నాయకులు గురువారం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కులగణనపై బీఆర్‌ఎస్ చేపట్టిన నిరసనలతో ప్రభుత్వం దిగివచ్చిందని, రీ సర్వే చేపట్టిందని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేసే దాకా ప్రభుత్వంపై పోరాటానికి ప్రజలను సమాయత్తం చేయాలన్నారు. కాగా, బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) ఆవిర్భవించి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో.. త్వరలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది.
ఈనెల 19న పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో తగిన ఏర్పాట్లు చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కేసీఆర్ ఆదేశించారు. బీఆర్‌ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రవెల్లి ఫాంహౌ్‌సలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 19న నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంతోపాటు ఇటీవల ప్రకటించిన సభకు సంబంధించిన తేదీ, వేదిక వంటి అంశాలపై లోతుగా చర్చించినట్లు తెలిసింది. కాగా, కులగణనలో వైఫల్యాలను డిప్యూటీ సీఎం భట్టి పరోక్షంగా అంగీకరించారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రె్‌సపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఆ కారణంగానే స్థానిక ఎన్నికలను మరింత ఆలస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.