Share News

Kavitha: మిస్‌ వరల్డ్‌ పోటీలను వాయిదా వేయాలి: కవిత

ABN , Publish Date - May 10 , 2025 | 03:59 AM

మిస్‌ వరల్డ్‌ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

Kavitha: మిస్‌ వరల్డ్‌ పోటీలను  వాయిదా వేయాలి: కవిత

చిక్కడపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి): మిస్‌ వరల్డ్‌ పోటీలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంటే అందాల పోటీలు పెట్టారన్న అపవాదు తెలంగాణకు వస్తుందని.. ఐపీఎల్‌ మాదిరి వాయిదా వేయాలని సూచించారు. ఇది విజ్ఞత ప్రదర్శించాల్సిన సమయమని.. తప్పుడు సంకేతాలకు తావు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. ఆపరేషన్‌ సిందూర్‌కు మద్దతుగా భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ వరకు కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి ర్యాలీ నిర్వహించింది.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 03:59 AM