Share News

Kavitha: ఆ మరణాలను బీఆర్‌ఎస్‌కు అంటగట్టడమేంటి?

ABN , Publish Date - Feb 28 , 2025 | 04:19 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పోరాడిన రాజలింగమూర్తి, ఆయన తరఫున వాదించిన న్యాయవాది సంజీవరెడ్డి, డ్రగ్స్‌ కేసు నిందితుడు కేదార్‌ మరణాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు.

Kavitha: ఆ మరణాలను బీఆర్‌ఎస్‌కు అంటగట్టడమేంటి?

  • రాజలింగమూర్తి, సంజీవ రెడ్డి, కేదార్‌ మరణాలపై సీఎం వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందన

హైదరాబాద్‌, పిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పోరాడిన రాజలింగమూర్తి, ఆయన తరఫున వాదించిన న్యాయవాది సంజీవరెడ్డి, డ్రగ్స్‌ కేసు నిందితుడు కేదార్‌ మరణాలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. ఏమాత్రం సంబంధంలేని బీఆర్‌ఎ్‌సకు ఈ సంఘటనలను ఎందుకు అంటగడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఇది బీజేపీ, కాంగ్రె్‌సలు కలిసి ఆడుతున్న డ్రామా అని మండిపడ్డారు. ప్రతీ విషయంలో బీజేపీతో కలిసి పని చేస్తున్న రేవంత్‌ రెడ్డి ఆర్‌ఎ్‌సఎస్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కవిత అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, అందులో భాగంగానే ఆ రెండు పార్టీల నేతలు లేనిపోని విషయాలను బీఆర్‌ఎ్‌సకు అంటగడుతున్నారని తెలిపారు.


న్యాయవాది సంజీవ రెడ్డి ఆరు నెలల క్రితం కోర్టులో అందరి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయారని, రాజలింగమూర్తి భూవివాదాల వల్ల హత్యకు గురయ్యారని ఆ జిల్లా ఎస్పీ చెప్పారని కవిత గుర్తు చేశారు. అలాగే, దుబాయ్‌లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లో వచ్చిందన్నారు. కానీ, ఈ సంఘటనలను ముఖ్యమంత్రి బీఆర్‌ఎ్‌సకు ఎందుకు అంటగడుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై కేసులు పెడతామని ప్రధానిని కలిసిన తర్వాత సీఎం అనడం చూస్తే... ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర చేస్తున్నాయనే విషయం అర్థమవుతుందని అన్నారు.

Updated Date - Feb 28 , 2025 | 04:19 AM