Kavitha: రేవంత్ సర్కారు నిర్లక్ష్యం.. ‘పాలమూరు’కు శాపం
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:05 AM
పాలమూరు ఎత్తిపోతలను 14 నెలలుగా రేవంత్ సర్కారు కోల్డ్‌స్టోరేజీలో పెట్టిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరుకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తాం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): పాలమూరు ఎత్తిపోతలను 14 నెలలుగా రేవంత్ సర్కారు కోల్డ్‌స్టోరేజీలో పెట్టిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరుకు శాపంగా మారిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ ముందుచూపుతో పాలమూరుకు 90 టీఎంసీల నికర జలాలు కేటాయించి ప్రాజెక్టును గట్టెక్కించే ప్రయత్నంచేస్తే.. కేంద్రం అనుమతులు సాధించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కొదిలేసిందని గురువారం ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆరోపించారు. కృష్ణా జలాల నీటి కేటాయింపులు తేలేవరకు పాలమూరు-రంగారెడ్డికి జాతీయహోదా ఇవ్వలేమని పార్లమెంటు సాక్షిగా కేంద్రం తేల్చి చెప్పిందన్నారు. నల్లమల బిడ్డననిచెప్పే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఈ ప్రాజెక్టు విషయంలో తేలిపోయిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని, కేసీఆర్‌పై కక్షతో సజీవ జలధారను వట్టిపోయేలా చేశారన్నారు. ఇదిలా ఉండగా.. రైతుభరోసా నిధుల విడుదలపై తాత్సారం చేస్తున్నారని, మాజీ సర్పంచులకు బకాయిపడిన బిల్లుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కవిత ఆరోపించారు. గురువారం పలువురు మాజీ సర్పంచులను కవితను ఆమె నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. ప్రభుత్వం తక్షణమే సర్పంచులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయడంతోపాటు రైతు భరోసా డబ్బులు వేయాలని.. లేకుంటే ప్రభుత్వంపై ఉద్యమిస్తామని ఈ సందర్భంగా కవిత హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News