యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 11:45 PM
యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా డ్రగ్స్‌కు బానిసలు కావద్దని ఎస్‌ఐ వేణుగోపాల్ అన్నారు. శ్రీవాణి డిగ్రీ, పీజీ కళాశాలల్లో మంగళవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవగా హన సదస్సులో మాట్లాడారు.
సుల్తానాబాద్, ఆగస్టు 19: (ఆంధ్రజ్యోతి): యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా డ్రగ్స్‌కు బానిసలు కావద్దని ఎస్‌ఐ వేణుగోపాల్ అన్నారు. శ్రీవాణి డిగ్రీ, పీజీ కళాశాలల్లో మంగళవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆవగా హన సదస్సులో మాట్లాడారు. మద్యపానం, ధూమపానం అలవాట్లతో జీవితం దారి తప్పుతుందన్నారు.
చదువుల్లో పోటీపడుతూ సన్మార్గంలో పయనించి ఉన్నత ఉద్యోగాలు పొందాలని, సమాజంలో ఆదర్శంగా జీవించాలని వేణుగోపాల్ అన్నారు. విద్యార్థులందరితో నో డ్రగ్స్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపాల్ బాలసాని శ్రీనివాస్, నశాముక్త్ భారత్ జిల్లా కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల, చైల్డ్‌లైన్, సిబ్బంది పాల్గొన్నారు.