యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:03 AM
మత్తు పదార్ధాలకు యువత బానిస కావద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. మాదకద్రవ్యాల నివారణపై అవగాహనను కల్పిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి మసీదు చౌరస్తా, జెండా చౌరస్తా మీదుగా ఎం.బి గార్డెన్స్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు.
పెద్దపల్లిటౌన్, సెప్టెంబరు 16 (ఆంఽధ్రజ్యోతి) మత్తు పదార్ధాలకు యువత బానిస కావద్దని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు. మాదకద్రవ్యాల నివారణపై అవగాహనను కల్పిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి మసీదు చౌరస్తా, జెండా చౌరస్తా మీదుగా ఎం.బి గార్డెన్స్ వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహనను కల్పిస్తూ పెద్ద సంఖ్యలో యువతను భాగస్వామ్యం చేస్తూ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మత్తుకు ఎవరూ బానిస కావద్దని యువత దేశానికి మార్గదర్శకంగా నిలువాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈగల్ అనే నినాదంతో మత్తును పారదోలడానికి పని చేస్తున్నారన్నారు. యువత ముఖ్యంగా తల్లిదండ్రుల గౌరవం కాపాడుతూ సమాజంలో మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
మాదకద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలపై మీ చుట్టు పక్కల ప్రాంతాల్లో వివరించాలన్నారు. మత్తు పదార్ధాల రావాణ విక్రయాలపై పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, దీని కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. కరీంనగర్‌కు చెందిన సైకియాట్రిస్ట్ వరేష్, మత్తు పదార్ధాల వల్ల కలిగే నష్టాలు, వాటికి అలవాటైన వారిని మాన్పించాలనే అంశాలపై వివరించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొంకూరి అవినాష్, డిసీపీ కరుణాకర్, ఎసిపి గజ్జి కృష్ణ, సిఐలు ప్రవీణ్, అనిల్, ఎస్సైలు, వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, టిఎన్‌జివో అధ్యక్షుడు బొంకూరి శంకర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.