యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:05 AM
యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. అం తర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవా ణా, మత్తు పదార్థాల నిర్మూలన వారోత్సవాలను పురస్క రించుకొని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా ర్థులకు గురువారం అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు.
రామగిరి, జూన్ 26(ఆఽంధ్రజ్యోతి): యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. అం తర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవా ణా, మత్తు పదార్థాల నిర్మూలన వారోత్సవాలను పురస్క రించుకొని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా ర్థులకు గురువారం అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ యు వత మత్తు పదార్థాల వినియోగం ద్వారా భవిష్యత్ ప్రశ్నార్థంగా మారే పరిస్థితి నెలకొం దన్నారు.
తాత్కాలిక ఆనందం కోసం మత్తు పదార్థాలకు బానిసలవు తున్నారని పేర్కొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భవిష్యత్ లక్ష్యాలను నిర్థేశించుకోవాలని సూచించారు. విద్యా ర్థులను డ్రగ్స్, గంజాయికి బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మత్తు పదార్థాలు అమ్మినా, కొనుగొలు చేసినా శిక్షలు తప్పవని హెచ్చరించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. విద్యా ర్థులతో ప్రమాణం చేయించారు. డీసీపీ కర్ణాకర్, ఏసీపీ రమేశ్, సీఐలు రాజు, ప్రసాద్‌రావు, ఎస్‌ఐలు శ్రీనివాస్, దివ్య, రమేశ్, సురేష్, ప్రిన్సిపాల్ విష్ణువర్థన్ పాల్గొన్నారు.