Share News

యువత సేవాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Sep 24 , 2025 | 11:51 PM

జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరిగిన వేడుకలకు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ, జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి డి.కల్పన ముఖ్యఅతిథులుగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

యువత సేవాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి

కోల్‌సిటీటౌన్‌, సెప్టెంబర్‌ 24(ఆంధ్రజ్యోతి): జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో జరిగిన వేడుకలకు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అరుణశ్రీ, జిల్లా ఇంటర్‌ విద్య నోడల్‌ అధికారి డి.కల్పన ముఖ్యఅతిథులుగా హాజరై స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ యువత సేవా స్ఫూర్తిని పెంపొందించు కోవాలన్నారు. దేశ జనాభాలో 30శాతానికి పైగా యువత ఉందని, ఏది సాధించాలన్నా యువతతోనే సాధ్యపడుతుందన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి దామరకొండ శంకర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపాల్‌ సంజీవయ్య, బాలికల కళాశాల ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్‌ రాజేందర్‌, అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

యూనివర్సిటీ పీజీ కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ వై.ప్రసాద్‌ మాట్లాడారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు క్రమశిక్షణ, సమాజ శ్రేయస్సు కోసం పాల్పడాలని, వ్యక్తిత్వవికాసాన్ని పెంపొందించుకోవాలన్నారు. అధ్యాపకులు డాక్టర్‌ రవి, డాక్టర్‌ సుధా, డాక్టర్‌ అంబిక, వలంటీర్లు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో బుధవారం ఎన్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ సంజీవయ్య మాట్లాడారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ మధుకర్‌ విద్యార్థులచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో కోరే శ్రీనివాస్‌, సీనియర్‌ అధ్యాపకులు కుక్కడపు శ్రీనివాస్‌, మంతెన శ్రీనివాస్‌, లైబ్రేరియన్‌ శంకరయ్య, రాజిరెడ్డి, జీడీ కనకయ్య, శ్రీ గోదా, శంకరయ్య, జగదీశ్వరి, శారద, వాలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 11:51 PM