యాసంగి యాక్షన్ ప్లాన్ ఖరారు
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:55 PM
యాసంగి పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నా చెరువులు, కుంటలు ప్రాజెక్ట్‌లలో సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో దానికి అనుగుణంగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
యాసంగి పంటల సాగుకు వ్యవసాయ శాఖ అధికారులు యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నా చెరువులు, కుంటలు ప్రాజెక్ట్‌లలో సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో దానికి అనుగుణంగానే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. జిల్లాలో 1.94 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులో వరి 1.83 ఎకరాల్లో సాగు చేస్తారని, అంచనా వేశారు. మొక్క జొన్న 2135 ఎకరాలు, నువ్వులు 490 ఎకరాలు, పొద్దుతిరుగుడు 1107 ఎకరాలు, కందులు 375 ఎకరాలు, వేరుశనగ 35 ఎకరాలు, పెసర 81ఎకరాలు, చెరుకు 20ఎకరాలు, జొన్న నాలుగు ఎకరాలు, ఇతర పంటలు 6745 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు.
ఫ 45312 మెట్రిక్ టన్నుల ఎరువులు
జిల్లాలో యాసంగి సాగుకు సంబంధించి 1.93 లక్షల ఎకరాల్లో వేసే పంటలకు ఎరువులు 45312 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఇందులో యూరియా 23128 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3562 మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకేఎస్ 12211 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 4885 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 1526 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ప్రస్తుతం సింగిల్‌విండోల వద్ద యూరియా 994.153 మెట్రిక్ టన్నులు, డీఏపీ 179.2 మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకేఎస్ 1526.07 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 281.9 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 124.5 మెట్రిక్ టన్నులు, మార్క్‌పెడ్ వద్ద యూరియా 1498.275 మెట్రిక్ టన్నులు, డీఏపీ 800 మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకేఎస్ 163 మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నాయి. వ్యవసాయ అధికారులు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను కూడా సిద్ధం చేస్తున్నారు.
యాసంగి సాగుకు ఢోకా లేదు...
మెట్ట ప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమృద్ధిగా కురిసిన వర్షాలతో యాసంగి సాగుకు ఢోకాలేదనే భరోసాతో ఉన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక రైతులు ఇబ్బందులు పడ్డారు. అల్పపీడన ప్రభావంతో భారీగా కురిసిన వర్షాలు సిరిసిల్ల, వేములవాడ మూలవాగులు ఉధృతంగా ప్రవహించడంతో మిడ్ మానేరుకు జలకళ వచ్చింది. జిల్లాలోని ఎగువమానేరు, నిమ్మపల్లి ప్రాజెక్ట్, అనంతారం ప్రాజెక్ట్‌లతో పాటుభారీ చెరువులు, కుంటలు జలకళతో ఉట్టిపడుతున్నాయి. మిడ్ మానేరులో 27.55 టీఎంసీల సామర్థ్యానికి 27.401 టీఎంసీల నీరు ఉంది. దీంతో వేములవాడ మూలవాగు, సిరిసిల్ల మానేరు వాగు బ్యాక్ వాటర్‌తో కళకళలాడుతోంది. దీంతో యాసంగిలో రైతులు పండించే పంటలకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధికంగానే వర్షాలు పడ్డాయి. నవంబరు వరకు సాధారణ వర్షపాతం 829.6 మిల్లీమీటర్లకు 966. మిల్లీమీటర్ల వర్షం కురసింది. జిల్లాలో రుద్రంగి 819.0మిల్లీమీటర్లు, చందుర్తి 912.4 మిల్లీమీటర్లు, వేములవాడ రూరల్ 864.8 మిల్లీమీటర్లు, బోయినపల్లి 795.1 మిల్లీమీటర్లు, వేములవాడ 1058.7 మిల్లీమీటర్లు, సిరిసిల్ల 929.5 మిల్లీమీటర్లు, కోనరావుపేట 1027.7 మిల్లీమీటర్లు, వీర్నపల్లి 970.4 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 1024.8 మిల్లీమీటర్లు, గంభీరావుపేట 1156.7 మిల్లీమీటర్లు, ముస్తాబాద్ 1135.21 మిల్లీమీటర్లు, తంగళ్లపల్లి 1142.2 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంట 1124.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో యాసంగి సాగుకు ఇబ్బందులు ఉండవని రైతులు భరోసాగా ఉన్నారు.
జిల్లాలో యాసంగి సాగు లెక్కలు
మండలం వరి మొత్తం
గంభీరావుపేట 18900 19420
ఇల్లంతకుంట 24500 26521
ముస్తాబాద్ 22200 23555
సిరిసిల్ల 4700 4895
తంగళ్లపల్లి 20200 21241
వీర్నపల్లి 7500 7500
ఎల్లారెడ్డిపేట 18000 18255
బోయినపల్లి 13600 15545
చందుర్తి 15500 15879
కోనరావుపేట 18100 18680
రుద్రంగి 4550 5682
వేములవాడ 5300 5522
వేములవాడ రూరల్ 10800 11136
-----------------------------------------------------------------------
మొత్తం 183850 193837
-----------------------------------------------------------------------