Share News

కార్మికులు సమ్మెను వ్యతిరేకించాలి

ABN , Publish Date - May 11 , 2025 | 11:51 PM

రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలైన కార్మిక సంఘాలు రాజకీయ ఎజెండాను అమలు చేయడానికి, కార్మిక సంఘాల ఉనికి చాటుకోవడానికి ఈనెల 20న చేస్తున్న రాజకీయ సమ్మెను సింగరేణి కార్మికులు వ్యతిరేకించాలని సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) అధ్యక్షుడు యాద గిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి కార్మికవ ర్గానికి విజ్ఞప్తి చేశారు.

కార్మికులు సమ్మెను వ్యతిరేకించాలి

గోదావరిఖని, మే 11(ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలైన కార్మిక సంఘాలు రాజకీయ ఎజెండాను అమలు చేయడానికి, కార్మిక సంఘాల ఉనికి చాటుకోవడానికి ఈనెల 20న చేస్తున్న రాజకీయ సమ్మెను సింగరేణి కార్మికులు వ్యతిరేకించాలని సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) అధ్యక్షుడు యాద గిరి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సారంగపాణి కార్మికవ ర్గానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం బీఎంఎస్‌ కేంద్ర కార్యాలయంలో యూనియన్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావే శంలో వారు మాట్లాడుతూ దేశంలో విప త్కర పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ప్రజ లకు, ప్రభుత్వాలకు రాజకీయాలకు అతీ తంగా మద్దతు పలుకాల్సిన రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్ల డం సరైన విధానం కాదని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, రక్షణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనం లేని రాజకీయ ప్రేరేపిత సమ్మెను వ్యతిరేకించాలన్నారు. దేశంలో ఉన్న పరిశ్రమల కార్మికులు, ఉద్యోగులు ప్రజలు అప్రమత్తంగా ఉండి దేశానికి అండగా ఉండాలని, సంక్షోభ సమయంలో సమ్మెకు పిలుపునివ్వడం దేశ సమగ్రతను విఘాతం కల్పించే విధంగా ఉంటుందని గమనించాలన్నారు. యూనియన్‌ నాయకుడు కర్రావుల మహేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు ఆకుల హరిణ్‌, సాయవేణి సతీష్‌, మేడ రామ్మూర్తి, పెంచాల వెంకటస్వామి, తుమ్మ గట్టయ్య, పుప్పాల నాగేంద్ర ప్రసాద్‌, సల్ల వేణు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:51 PM