Share News

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 29 , 2025 | 12:27 AM

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ పిలుపు మేరకు సింగరేణి అపరిష్కృత సమస్యలపై గురువారం ఆర్‌జీ-1లోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్‌లపై టీబీజీకేఎస్‌ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అధికారులకు మెమోరాండాలు అందజేశారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

గోదావరిఖని, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కమిటీ పిలుపు మేరకు సింగరేణి అపరిష్కృత సమస్యలపై గురువారం ఆర్‌జీ-1లోని అన్ని గనులు, డిపార్ట్‌మెంట్‌లపై టీబీజీకేఎస్‌ ఆర్‌జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అధికారులకు మెమోరాండాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ వాస్త వ లాభాలను ప్రకటించి వాటిపై 35శాతం లాభాలను కార్మిక వర్గానికి చెల్లించాలని, వంద శాతం మెడికల్‌ ఇన్‌వ్యాలిడేషన్‌ చేయాలని, గత మెడి కల్‌ బోర్డులో ఏడు నెలలుగా జీతాలు లేకుండా ఫిట్‌ అయిన కార్మికులం దరికీ మరోసారి మెడికల్‌ బోర్డుకు పిలిచి అన్‌ఫిట్‌ చేయాలన్నారు. సింగరేణి ప్రాంతంలోని గనులను వేలం వేయకుండా సింగరేణికే కేటా యించాలని, కొత్త ట్రాన్స్‌ఫర్‌ పాలసీని రద్దు చేయాలని పెర్క్స్‌పై అల వెన్సులను యాజమాన్యమే చెల్లించాలన్నారు. టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ మాదాసి రామమూర్తి, పర్లపెల్లి రవి, ప్రదీప్‌, మురళీ, తిరుపతి, శేషగిరి, మీస రాజు, దిడ్డి లక్ష్మణ్‌, పాల్గొన్నారు.

యైుటింక్లయిన్‌కాలనీ, (ఆంధ్రజ్యోతి): సింగరేణి యాజమాన్యం కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై నిర్లక్ష్యధోరణి వహించడాన్ని నిరసిస్తూ ఆర్జీ-2 ఏరియాలోని గనులు, డిపార్ట్‌మెంట్లపై టీబీజీకేఎస్‌ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపాయి. ఏరియా వైస్‌ ప్రెసిడెంట్‌ అయిలి శ్రీనివాస్‌ మాట్లా డారు. ఎన్నికల సమయంలో గుర్తింపు సంఘం 100 శాతం మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ చేయిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోవాలని డిమాండ్‌ చేశారు. సంస్థలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, కొత్త గనులు ప్రారం భించాలని యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభాకర్‌రెడ్డి, బేతి చం ద్రయ్య, సత్యం, సతీష్‌, మామిడి తిరుపతి, రవితేజ, పాల్గొన్నారు.

ఓసీపీ-1 ప్రాజెక్టులో పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని టీబీజీకేఎస్‌ ఆర్జీ-3 వైస్‌ ప్రెసిడెంట్‌ నాగెల్లి సాంబయ్య ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో కార్మి కులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనలలో సంపత్‌రెడ్డి, తిరుపతి, సత్య నారాయణ, పూర్ణాకర్‌, శ్రీకాంత్‌రావు, కుమార్‌ పాల్గొన్నారు.

రామగిరి, (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు 2024-25లో వచ్చే వాస్తవ లాభాల పై 35 శాతం వాటా చెల్లించాలని, పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని టీబీజీకేఎస్‌ దశల వారి నిరసన కార్యక్రమాలలో భాగంగా ఆర్జీ-3, ఏపిఏ డివిజన్‌ల పరిధిలోని గని మేనేజర్‌లకు నల్లబ్యాడ్జిలతో వినతి పత్రాలను అందజేశారు. ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు నాగెల్లి సాంబయ్య, నాయ కులు వేముల రవిశంకర్‌, దేవశ్రీనివాస్‌, పాశం శ్రీనివాస్‌రెడ్డి, వివిగౌడ్‌, క్రాంతి, శేఖర్‌, రమేశ్‌, తిరుపతి, సదానందం, షరిఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2025 | 12:27 AM