ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పనిచేయండి
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:00 AM
ప్రజలు నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావ రణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల పనితీరు ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి పోలీసు సిబ్బందికి సూచిం చారు. ఎన్నికల నిర్వహణపై శనివారం స్థానిక గౌతమీబుద్ద ఫంక్షన్‌హాల్‌లో సిబ్బం దికి సమావేశం ఏర్పాటు చేసి పలు సూచన లను, సలహాలు ఇచ్చారు.
ధర్మారం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రజలు నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావ రణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీసుల పనితీరు ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి పోలీసు సిబ్బందికి సూచిం చారు. ఎన్నికల నిర్వహణపై శనివారం స్థానిక గౌతమీబుద్ద ఫంక్షన్‌హాల్‌లో సిబ్బం దికి సమావేశం ఏర్పాటు చేసి పలు సూచన లను, సలహాలు ఇచ్చారు. ప్రతీ ఒక్కరు ఎన్ని కల నియామావళికి లోబడి విధులు నిర్వ హించాలని ఆదేశించారు. మండలంలోని పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి ఎన్నికలు జరిగే సమయం నుంచి కౌంటింగ్ జరిగే వరకు పకడ్బందీగా పని చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లను మినహా ఎవరిని రానివ్వవద్దని, బూత్‌లకు 100 మీటర్ల లోపు సెల్‌ఫోన్లు ఇంక్ బాటిల్స్ తీసుకురాకుండా ప్రతి ఒక్క రిని తనిఖీ చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. మండలంలోని ఏ రూట్‌లోనైనా అనుకొని సంఘటనలు జరిగితే వెంటనే రూట్ మొబైల్ టీమ్‌లు చేరుకొని సమస్యను పరిష్కరిం చాలని కోరారు. ఆది వారం జరుగనున్న ఎన్నికలు సజావుగా జరిగేల 160 మంది పోలీస్ సిబ్బంది విధు లు నిర్వహిస్తున్నారు. రూట్ ఆఫీసర్లుగా ఏడుగురు ఎస్‌ఐలు విధులు నిర్వర్తిస్తుండగా, స్ర్టైకింగ్ ఫోర్స్ ఆఫీస ర్లుగా ముగ్గురు సీఐలు, స్పెషన్ స్ర్టైకింగ్ ఫోర్స్ ఆఫీసర్‌గా పెద్దపల్లి ఏసీపీ పనిచేస్తున్నారు.