బాలికల విద్య ద్వారానే మహిళా సాధికారత సాధ్యం
ABN , Publish Date - Nov 25 , 2025 | 11:35 PM
బాలికల విద్య ద్వారనే మహిళా సాధికా రతను సాధించవచ్చని జిల్లా మహిళా సాధికా రిత కేంద్రం సమన్వయకర్త డా. దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ జాబు సుచరిత అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై మం గళవారం మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు అవగాహన కల్పించారు.
పెద్దపల్లి రూరల్, నవంబరు 25 (ఆంధ్ర జ్యోతి): బాలికల విద్య ద్వారనే మహిళా సాధికా రతను సాధించవచ్చని జిల్లా మహిళా సాధికా రిత కేంద్రం సమన్వయకర్త డా. దయా అరుణ, జెండర్ స్పెషలిస్ట్ జాబు సుచరిత అన్నారు. జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై మం గళవారం మూలసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిల్లలకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపై రంగవళ్లుల పోటీలు నిర్వహించారు. రంగవళ్ళు లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో పాటు సం దేశాత్మకత ఉట్టిపడేట్టుగా ప్రతిభా పాటవాలు కనబరిచిన పిల్లలకు బహుమతులను అందిం చారు. విద్యార్థులకు బాలల హక్కులు, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. మహిళలపై గృహహింస, వయోవృద్ధుల రక్షణ, దివ్యాంగులపై వివక్షను నిర్మూలించడానికి టోల్‌ఫ్రీ నంబర్లపై వివరించారు. టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం అందించిన వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని పేర్కొ న్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వంద శాతం హాజరు కలిగిన పిల్లలకు కమల ఫౌండేషన్ అధ్యక్షుడు సాదుల వెంకటేశ్వర్లు బహుమతులను ప్రదానం చేశారు. ప్రధానో పాధ్యాయులు సర్దార్ అబ్దుల్ హైజావీద్, ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి, బాదం జ్యోతి, కరాటే మాస్టర్ కొండిల్ల సదానందం, కాంపెల్లి కొమురయ్య విద్యార్థులు పాల్గొన్నారు.