మహిళలు స్వయం ఉపాధిలో ముందుండాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:48 PM
మహిళలు స్వయం ఉపాధిలో ముందుం డాలని విశ్వహిందు పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్ముళ్ల సత్యంజీ అన్నారు. మంగళ వారం శారదానగర్‌లోని విశ్వహిందు పరిషత్ భవన్‌లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ప్రశంసాపత్రాలను అందజేశారు.
కళ్యాణ్‌నగర్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మహిళలు స్వయం ఉపాధిలో ముందుం డాలని విశ్వహిందు పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్ముళ్ల సత్యంజీ అన్నారు. మంగళ వారం శారదానగర్‌లోని విశ్వహిందు పరిషత్ భవన్‌లో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ విశ్వహిత సేవా ట్రస్ట్ ఆధ్వ ర్యంలో మహిళలు తమ కాళ్లపై నిలబడేందుకు ఉచితంగా కుట్టు శిక్షణ అందిస్తున్నట్టు చెప్పారు.
ఇప్ప టి వరకు గోదావరిఖనిలో 400మంది మహిళలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందార తెలిపారు. గోదా వరిఖనిలో మరిన్ని సేవా కార్యక్రమా లు నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రాంత సేవా ప్రముఖ్ కోమళ్ల రాజేందర్‌రెడ్డి, వీహెచ్ పీ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, మాతృశక్తి సంయోజక్ భవాని, కుట్టు శిక్షణ నిర్వాహ కులు ఆరెళ్లి మమత, మహిళలు వీణ, మం జుల, దీప్తి, సుమ, కీర్తన, స్రవంతి, నవ్య, స్వాతి, శ్రీనిధి, మానస పాల్గొన్నారు.