Share News

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

ABN , Publish Date - Jun 18 , 2025 | 12:00 AM

మహిళలు ఆర్థికంగా బలోపే తం కావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ర్యాంప్‌ ప్రాజెక్టు పై నిర్వహించిన ఒకరోజు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 17 (ఆంఽధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా బలోపే తం కావాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ర్యాంప్‌ ప్రాజెక్టు పై నిర్వహించిన ఒకరోజు అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు అందించే ఏకరూప దుస్తులు నాణ్యతతో కుట్టెందుకు ఒక్కో మహిళా సభ్యురాలి పై రోజుకు 200 రూపాయలు ఖర్చు చేస్తూ 10 రోజులు ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించి మహిళలకు శాశ్వతంగా కుట్టు పని ఉండేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అన్ని రకాల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. ర్యాంప్‌ ప్రాజెక్టు కింద ఎంఎస్‌ఎంఈ రంగంలో చిన్నచిన్న వ్యాపారాల ఏర్పాటు, వాటి నిర్వహణకు అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని వివరించారు. స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు ఆర్థిక రంగంలో ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ఈనెల 20 నుంచి రాఖీల తయారీపై శిక్షణ ఇస్తామని, దీని వల్ల రాబోయే రోజుల్లో మంచి వ్యాపార అవకాశాలు ఉంటాయన్నారు. స్వశక్తి మహిళా సంఘాల మార్కెట్‌ విస్తరించాలని, కిరాణా షాపు, గిర్ని సెంటర్‌ ఏర్పాటు వంటి వ్యాపారాల ఏర్పాటుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులు, పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 12:00 AM