Share News

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:37 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తూ వారి ఆర్థిక ఆభివృద్దికి చేయూతనందిస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గర్రెపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముగ్గులు పోసే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట

సుల్తానాబాద్‌, జూలై 20: (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తూ వారి ఆర్థిక ఆభివృద్దికి చేయూతనందిస్తుందని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. గర్రెపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముగ్గులు పోసే కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పలు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. పంచాయతీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతు బీఆర్‌ఎస్‌ హయాంలో ఆచరణకు యోగ్యం కానీ హమీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. తాము ఇచ్చిన హామీలను ఏడాదిన్నర కాలంలోనే అమలు చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు తక్కువ ధరకే ఇటుక ఇప్పించడానికి కలెక్టర్‌తో మాట్లాడామని, బట్టీ యజమానులతో కూడా మాట్లాడి రెండు నుంచి నాలుగు రూపా యలు తగ్గించే ఆలోచన చేస్తున్నామన్నారు.

నియోజకవర్గంలో 4521 మహిళా సంఘాలకు 4 కోట్ల 94 లక్షల రూపాయల వడ్డీలేని రుణాలు ఇచ్చామన్నారు. త్వరలోనే మహిళా సంఘాలలో సభ్యులు గా ఉన్న మహిళలకు ఏడాదికి రెండు చీరల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. గర్రెపల్లి సహకారం సంఘం మాజీ చైర్మన్‌ కల్లెపల్లి జానీ ఆఽధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. కమాన్‌ నుంచి చౌరస్తా వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్‌ చైర్మన్‌ మినుపాల ప్రకాష్‌ రావు, పన్నాల రాములు, దామోదర్‌ రావు, చిలుక సతీష్‌, మాజీ ఎంపీటీసీ పులి వెంకటేశం, సత్యనారాయణరావు, బండారి రమేష్‌, మాదాసు వెంకన్న పటేల్‌, చక్రధర్‌, రాజలింగం, డీకొండ శ్రీనివాస్‌, జూపల్లి తిరుమల్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 11:37 PM