అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటారా
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:13 AM
రామగుండంలో అభివృద్ధి చేస్తుంటే కొందరు నాయకులు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని, ఇది సరైంది కాదని శివాజీనగర్ బట్టల వ్యాపార సంఘం అధ్యక్షుడు సదయ్య అన్నారు. శనివారం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో వస్త్ర వ్యాపారులు, ప్లవర్ మర్చంట్, బుక్క దుకాణాదారులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
కళ్యాణ్‌నగర్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రామగుండంలో అభివృద్ధి చేస్తుంటే కొందరు నాయకులు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని, ఇది సరైంది కాదని శివాజీనగర్ బట్టల వ్యాపార సంఘం అధ్యక్షుడు సదయ్య అన్నారు. శనివారం మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లో వస్త్ర వ్యాపారులు, ప్లవర్ మర్చంట్, బుక్క దుకాణాదారులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ వ్యాపారస్థులకు ఎలాంటి అన్యాయం జరుగలేదని, పట్టణాభివృద్ధిలో భాగంగా కొందరి దుకాణాలు కోల్పోయినప్పటికీ వారికి నూతనంగా షాపింగ్ నిర్మాణం చేపట్టి అందులో గదులతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నామని, తమకు తాత్కాలికంగా వ్యాపారం చేసుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్‌లో ప్రత్యామ్నాయంగా షాపులు కేటాయించి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఆదుకున్నారన్నారు. పట్టణంలో ఏ చిరు వ్యాపారిని కూడా రోడ్డున పడవేయలేదని, కొందరు తమ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు చేస్తూ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా చూడడం సరైంది కాదని, ఇప్పటికైనా నాయకులు తమ బుద్ధిని మార్చుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. నాయకులు వంగ దేవేందర్, గోలి రంగన్న, అంజయ్య, సతీష్, శంకర్, రాజమల్లు, నవీన్, మురళి, అరుణ్, చింతల సదానందం, సతీష్, సంపత్ పాల్గొన్నారు.