మైనారిటీ సంక్షేమానికి కృషి చేస్తా
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:27 AM
ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హామీ ఇచ్చారు. పట్టణంలోని ఫారన్ మసీద్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాఘవ పూర్ గ్రామ శివారులో ఖబ్రస్తాన్ నిర్మాణానికి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత భూమి కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు.

పెద్దపల్లిటౌన్, ఫిబ్రవరి 13: ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు హామీ ఇచ్చారు. పట్టణంలోని ఫారన్ మసీద్‌లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాఘవ పూర్ గ్రామ శివారులో ఖబ్రస్తాన్ నిర్మాణానికి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత భూమి కేటాయింపు ప్రక్రియ చేపట్టామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖబ్రస్థాన్, షాదీఖానా, డిగ్రీ కళాశాల, బైపాస్ రోడ్డు, బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరారని తెలిపారు. ఖబ్రస్తాన్, బస్ డిపో మంజూరు చేయించినట్లు తెలిపారు. మార్చి తర్వాత పనులు ప్రారంభించనున్నట్లు, అలాగే బైపాస్ రోడ్డు టెండర్లు పూర్తయ్యాయని, మే మొదటి వారంలో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వివరించా రు. ఎమ్మెల్యేను పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. మార్కెట్ చైర్‌పర్సన్ ఈర్ల స్వరూప, మున్నూ భాయ్,ఎంఏ హై జావిద్,ఎం ఏ ఖలీల్,ఆరిఫ్, సయ్యద్ మస్రత్, షాకీర్, ఎంఏ మొయిద్, ఇంతియాజ్ ఖాన్,అంజద్ అలీ, పాల్గొన్నారు.