Share News

ఎల్‌ఆర్‌ఎస్ ముందుకు సాగేనా!

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:58 AM

రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియను తెరపైకి తెచ్చింది. మార్చి 31వ తేదీ వరకు క్రమబద్దీకరించే వారికి 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయితే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అనధికారిక లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఇవ్వగా రుసుం ఎక్కువగా ఉండడంతో ఆసక్తి చూప లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రుసుంలను సవరిస్తామని ప్రకటించింది. అయితే అందుకు సంబంధించి జారీ చేసే ఉత్తర్వులపై ఎల్‌ఆర్‌ఎస్‌ ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎల్‌ఆర్‌ఎస్ ముందుకు సాగేనా!

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ముందుకు సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అనధికారిక లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఇచ్చింది. అయితే చెల్లించాల్సిన రుసుం ఎక్కువగా ఉండడంతో ఎవరూ ఆసక్తి చూపలేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం 2020 చట్టం ప్రకారం నిబంధనలను అనుసరించి ఏర్పాటు చేసిన వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ర్టేషన్‌ చేసేందుకు అనుమతి ఇచ్చింది. మార్చి 31వ తేదీ వరకు రుసుం చెల్లించే వారికి 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 20న సీఎస్‌ శాంతికుమారి జీవో నెం బరు 28 విడుదల చేశారు. ఈ నిర్ణయంతో నత్తనడకన సాగుతున్న ఎల్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ముందుకు సాగు తుందా అనే చర్చ జరుగుతున్నది. సవరించిన మేరకు రుసుంలు ఎంత మేరకు ఉండనున్నాయి, స్లాబ్‌లు ఏమైనా తగ్గుతాయా అని ప్రభుత్వం జారీ చేసే ఉత్త ర్వులపై ఎల్‌ఆర్‌ఎస్‌ ఆధారపడి ఉంటుందనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. రాయితీ ఇవ్వడంతో ప్రభు త్వానికి ఆదాయం సమకూరనున్నదని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచా యతీల్లో అక్రమ లే అవుట్లు, రిజిస్ట్రేషన్లు లేని ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు 2020 సెప్టెంబర్‌ 1న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 26 ఆగస్టు 2020లోపు సేల్‌ డీడ్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసిన లే అవుట్‌ యజమానులు, ప్లాటు ఓనర్లకు ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించినట్లు ప్రకటించింది. అందులోని లే అవుట్‌ నిబంధనలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం అప్పటి ప్రభుత్వం దరఖా స్తులను స్వీకరించింది. ఆ మేరకు పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలో 9.675 దరఖాస్తులు, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 7,078, సుల్తానాబాద్‌లో 1,531, మంథనిలో 894, పెద్దపల్లి రూరల్‌ ఏరియాలో 6,334 దరఖాస్తులు, మొత్తం 25,512 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పెద్దపల్లి మున్సిపల్‌లో 2,838, రామగుండంలో 6,653, సుల్తానాబాద్‌లో 766, మంథనిలో 875, పెద్దపల్లి రూరల్‌ పరిధిలో 464 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. వాటి పరిశీలన కొనసాగుతూనే ఉన్నది.

పది శాతం ప్లాట్లు విక్రయిస్తేనే...

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2020 ఆగస్టు 26కు ముందు వెంచర్‌ ఏర్పాటు చేసిన యజ మాని అందులో కనీసం 10 శాతం ప్లాట్లను రిజిష్టర్డ్‌ సేల్‌డీడ్‌ ద్వారా విక్రయించి ఉంటేనే ప్రస్తుత నిబంధన వర్తిస్తుంది. ఆ ప్రకారం సదరు వెంచర్‌లలోని మిగతా 90 శాతం ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. తద్వారా 2020కి ముందు ఏర్పాటు చేసిన వెంచర్‌లోని మొత్తం ప్లాట్లను విక్రయించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ఆయా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు మార్చి 31లోపు నిర్ణీత క్రమబద్దీకరణ చార్జీలు, ఓపెన్‌ స్పేస్‌ కంట్రిబ్యూషన్‌ చార్జీలు చెల్లించిన పక్షంలో పై ఫీజుల్లో వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.25 శాతం రాయితీ ఇస్తారు. ఈ ప్రకారం 200 చదరపు గజాలు కలిగిన ఒక్కో ప్లాటుపై కొనుగోలుదారులకు కనీసం రూ. 15 వేల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. అయితే వెంచర్‌లో నిబంధనల మేరకు 10 శాతం రిజిస్టర్డ్‌ సేల్‌డీడ్‌ ద్వారా అమ్మకాలు జరుపనట్లయితే అందులో ఉన్న ఏ ఒక్క ప్లాటుకూ ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశాలు లేవు. అలాగే 2020 ఆగస్టు 26 తరువాత ఏర్పాటు చేసిన వెంచర్లలోనూ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు నిబం ధనలు అనుకూలించవు. దీంతో అనుమతి లేని లే అవుట్లలోని ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇళ్లు నిర్మా ణాలు చేపట్టేందుకు అనుమతులు వచ్చే అవకాశాలు లేవు. అలాగే లే అవుట్‌ లేని వెంచర్లలో రోడ్డు కనీసం 30 ఫీట్ల వెడల్పు ఉండాలి. రోడ్డు తక్కువగా ఉన్న పక్షంలో సదరు ప్లాటు నుంచే రోడ్డుకు సరిపడా స్థలం మినహాయించి, మిగిలిన భూమికే రిజిస్ట్రేషన్లు చేస్తారు. అలా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల తప్పిదానికి ప్లాట్ల కొనుగోలు దారులు మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమ వసూళ్లకు చెక్‌...

ప్రభుత్వ నిర్ణయంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమ వసూళ్లకు చెక్‌ పడనుండగా, ప్రభుత్వ ఖజా నాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరనుంది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వక ముందు దొడ్డిదారిన కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగేవి. అలా రిజిస్ట్రేషన్‌ చేసే ఒక్కో డాక్యుమెంట్‌పై సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల యాల్లో రూ. 30వేల నుంచి రూ. 40 వేల వరకు అక్ర మంగా వసూలు చేసేవారు. ఒకవేళ అందులో ఏమైనా లిటిగేషన్లు ఉంటే మాత్రం రూ.80 వేల వరకు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక నుంచి నేరుగా ప్రభు త్వ ఖజానాకు చేరనున్నాయి. ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో వినియోగదారులపైనా కొంత భారం తగ్గనున్నది. రుసుంలకు సంబంధించి ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది.

Updated Date - Feb 23 , 2025 | 12:58 AM