కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తే కాంగ్రెస్ నేతలకు ఉలుకెందుకు
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:14 AM
కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్‌లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో సందర్శిస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను విమర్శించడం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు తగదని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు.
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు పంపుహౌస్‌లను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో సందర్శిస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారని, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను విమర్శించడం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు తగదని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన్నారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆరు పర్యాయాలు కొప్పుల ఈశ్వర్ గెలుపొంది ప్రజల మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్‌ను సందర్శించామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్, నాయకులపై విమర్శలకు దిగుతున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు, నిధుల కోసమే జరిగిందని గుర్తు చేశారు. పుట్ట మధుకర్ మాట్లాడుతూ మంత్రి పదవిలో ఉన్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ గోదావరి స్వరూపాన్ని గురించి మాట్లాడితే బాగుండేదన్నారు. వైఎస్సార్ తర్వాత వ్యవసాయం, పంటల గురించి అవగాహన వారికి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనే భూములు సస్యశ్యామలమయ్యాయని అన్నారు. రేషన్ కార్డుల గురించి తప్ప మరొకటి మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల కు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి నివాళులరిఁంచారు. జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, గంట రాములు యాదవ్, ఉప్పురాజ్ కుమార్ , నారాయణదాసు మారుతి, పెంచాల శ్రీధర్, పూదరి చంద్రశేఖర్, వెన్న రవీందర్, పల్లె మధు, పాల్గొన్నారు.