Share News

ఇసుక కోసం వెళ్శి.. మానేరులో చిక్కుకొని

ABN , Publish Date - Sep 16 , 2025 | 11:55 PM

సుల్తానాబాద్‌ మండలంలోని గట్టేపల్లికి చెందిన కొందరు ట్రాక్టర్‌ యజమానులు, కూలీలు ఇసుక కోసం ట్రాక్లర్లతో మానేరు వాగులోకి మంగళవారం ఉదయం వెళ్శారు. కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ నుంచి నీరు విడుదల చేసిన విషయం వారికి తెలియదు. మహిళతోపాటు ఎనిమిది మంది వాగులో ఇసుక నింపుతుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో చిక్కుకుపోయారు.

ఇసుక కోసం వెళ్శి.. మానేరులో చిక్కుకొని

సుల్తానాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సుల్తానాబాద్‌ మండలంలోని గట్టేపల్లికి చెందిన కొందరు ట్రాక్టర్‌ యజమానులు, కూలీలు ఇసుక కోసం ట్రాక్లర్లతో మానేరు వాగులోకి మంగళవారం ఉదయం వెళ్శారు. కరీంనగర్‌లోని ఎల్‌ఎండీ నుంచి నీరు విడుదల చేసిన విషయం వారికి తెలియదు. మహిళతోపాటు ఎనిమిది మంది వాగులో ఇసుక నింపుతుండగా ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో చిక్కుకుపోయారు. వారు బయటకు రాలేని దుస్థితి నెలకొంది. ప్రవాహంలో ట్రాక్లర్లు కొట్టుకుపోయాయి. బాధితులు పెద్ద గా కేకలు వేయడంతో వాగు ఒడ్డున ఉన్న వారు సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్‌ కుమార్‌ మానేరు వాగు వద్దకు వచ్చి స్థానికుల సహాయంతో వాగులో ఉన్న వారిని తాళ్ళతో బయటకు తీసుకువచ్చారు.

ఎవరూ వాగులోకి వెళ్ల వద్ద

ఇసుక కోసం ఎవరూ మానేరు వాగులోకి వెళ్లవద్దని సీఐ సుబ్బారెడ్డి, ఎస్‌ఐ శ్రావణ్‌ కుమార్‌లు హెచ్చరించారు. మానేరు పరివాహక ప్రాంత గ్రామాలకు చెందిన ఇసుకను తరలించే ట్రాక్టర్‌ యజమానులు, డ్రైవర్లు కూలీలతో సమావేశం నిర్వహించి మానేరు గేట్లు ఎత్తడంతో నీటి ఉదృతి పెరిగిందని, ప్రస్తుతం ప్రమాదకరంగా ఉందన్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గేట్లు ఎత్తడం వలన గట్టేపల్లి నీరుకుళ్ల వద్ద గల చెక్‌ డ్యామ్‌ల నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.

Updated Date - Sep 16 , 2025 | 11:55 PM