సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలి
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:58 PM
ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అంతర్గాం మండల కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
గోదావరిఖని, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అంతర్గాం మండల కాంగ్రెస్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రతీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని, గ్రామ స్థాయి నుంచి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించాలని, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా పని చేయాలని నాయకులకు సూచించారు.
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ మాజీ సర్పంచ్
అంతర్గాం మండలం పొట్యాల మాజీ సర్పంచ్ వేల్పుల సమ్మయ్యతో పాటు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మల్లేష్, రాజేష్, తిరుపతి, శ్రీకాంత్‌తో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన నాయకులను అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా పని చేయాలని, పదవులు ప్రతి ఒక్కరికి వస్తాయని, ఎవరు అధైర్యపడకుండా పార్టీ గెలుపు కోసం పని చేయాలని, తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ హామి ఇచ్చారు.