అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Oct 24 , 2025 | 11:19 PM
అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. పెద్దాపూర్ అనుబంద గ్రామమైన కుర్మపల్లికి మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు.
జూలపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించేలా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అన్నారు. పెద్దాపూర్ అనుబంద గ్రామమైన కుర్మపల్లికి మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. ఎంపీడీవో పద్మజ, పార్టీ మండల అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాస్, విండో చైర్మెన్ పుల్లూరి వేణుగోపా ల్‌రావు, మార్కెట్ వైస్ చైర్మన్ కొమ్మ పోచాలు, నాయకులు లింగయ్యగౌడ్, జలపతిరెడ్డి, పల్లాటి రవి, పెసరు లచ్చయ్య, రాగల్ల రవి, గడ్డం క్రిష్ణారెడ్డి, కనుకయ్య, గోపాలక్రిష్ణ, శంకర్, బండి స్వామి, అధికారులు పాల్గొన్నారు.